బేస్తవారిపేట: అన్నపై తమ్ముడు కత్తితో దాడి
సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం బెస్తవారిపేటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు బేస్తవారికి పేటకు చెందిన పెద్దబాదుల్లను తమ్ముడు చిన్న బాదుల్ల అవసరానికి డబ్బులు అడగగా అన్న ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందినా తమ్ముడు కత్తితో దాడి చేశాడని అన్నకు తీవ్ర గాయాలు కావడం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.