శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంక్

77చూసినవారు
శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంక్
హనుమంతునిపాడు మండలంలోని దొడ్డిచింతల పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోనని కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లర్లకు పెచ్చులూడుతున్నాయి. పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్