ఎన్నికల టీంలు ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ముత్తిరెడ్డి

80చూసినవారు
ఎన్నికల టీంలు ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ముత్తిరెడ్డి
కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మండలంలో మూడు ఎన్నికల టీములను నియమించినట్లు వెలిగండ్ల మండల పార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ టీములు ప్రతిక్షణం పార్టీ కోసం కృషి చేస్తూ ఓటర్లను చైతన్య పరుస్తూ టీడీపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు కే. ఇంద్ర భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్