రేషన్ పంపిణీలో అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు

57చూసినవారు
రేషన్ పంపిణీలో అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు
ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే నిత్యావసర పంపిణీ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం కాశిరెడ్డి నగర్ కాలనీలో పేదలకు పంపిణీ చేసే నిత్యవసర వస్తువుల వాహనమును ఆకస్మికముగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ నిత్యవసర సరుకులు పంపిణీలో ఎటువంటి జాప్యం లేకుండా అందరికీ కచ్చితంగా సరఫరా చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్