టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అదివారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి ప్రతి అర్జీదారునితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడతామని తెలిపారు.