గరుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

78చూసినవారు
గరుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కొండేపి నియోజకవర్గంలోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9 తరగతుల్లో మిగులుగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ పాఠశాలల కన్వీనర్ రాజారావు సోమవారం కోరారు. జూన్ 5వ తేదీ నుంచి 15 తేదీ లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థులు తప్పని సరిగా ఇంగ్లీషు మీడియం చదివి ఉండాలని తెలిపారు. వేటపాలెంలో ఈ నెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్