ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘరానా దొంగలను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆదివారం సీఐ హజరతయ్యా వెల్లడించిన వివరాల మేరకు ఒంటరిగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి ఆ తర్వాత వారిని బెదిరించి ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నెల్లూరు జిల్లా ఉలవపాడు గ్రామానికి చెందిన సాయి, శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.