మార్కాపురం: అర్ధరాత్రి కొండచిలువ కలకలం

67చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరం పల్లిలో కొండచిలువ కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ పశువుల పాకలో 10 అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో హడలిపోయిన రైతు వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కొండచిలువను చాకచక్యంగా వ్యవహరిస్తూ బంధించారు. తర్వాత అటవీ ప్రాంతంలో కొండచిలువను విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్