మార్కాపురం: యువకుడిపై దాడి

50చూసినవారు
మార్కాపురం: యువకుడిపై దాడి
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శుక్రవారం ఓ యువకుడిపై దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ప్రైవేట్ కళాశాలకు వెళ్ళే యువతి వెంటపడుతున్నాడని ఆమె బంధువులు యువకుడిని చితకబాదారు. యువకుడికి గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై సమాచారాన్ని అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్