మార్కాపురం: ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

60చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు గురువారం తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు 70 సెంట్లు భూమిని ఆక్రమించారని స్థానిక ప్రజలు రెవెన్యూ సదస్సులో గతంలో ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ ఆక్రమించిన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్