ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె సరదాగా గడిపారు. విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. తర్వాత పాఠశాల నిర్వహణ తీరును ఆమె అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో పాటు సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ పాల్గొన్నారు.