ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో విద్యార్థులు, పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. 1959లో చైనా సైన్యం చేతిలో అసువులు వాసిన భారత సైన్యానికి పలువురు నివాళులు అర్పించారు. వారికి గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్కర్ణ దినోత్సవాన్ని జరుపుకుంటామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.