ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి పెట్టామని మార్కాపురం సిఐ సుబ్బారావు అన్నారు. సోమవారం మండలంలోని కోమటికుంట సమీపంలోని జాతీయ రహదారిని పరిశీలించారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతంలో సీ. సీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారించబడతాయో అనే అంశంపై సీఐ పరిశీలించారు. ప్రజల సురక్షితంగా ఇంటికి చేరడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.