ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని విశ్వనాధపురంలో జనవరి 16వ తేదీన భార్యపై ఇనప రాడ్డుతో దాడి చేసిన భర్తపై ఆదివారం బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భర్త దాడిలో భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె బంధువులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అతిగా మద్యం సేవించి తరచూ తనను వేధిస్తున్నట్లుగా భర్త పై బాధితురాలు ఫిర్యాదు చేసింది.