పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో మంచు దుప్పటి

62చూసినవారు
ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో మంగళవారం మంచు దట్టంగా అలుముకుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి మంచు కమ్మేయడంతో ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటల వరకు చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడ్డారు. యర్రగొండపాలెం మార్కాపురం, గిద్దలూరు పరిసర ప్రాంతాలలోని అటవీ ప్రాంతంలో మంచు ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది.

సంబంధిత పోస్ట్