మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
మార్కాపురం పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ పఠాన్ ముతుజా ఖాన్ (56) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తిరుపతి జిల్లా నాయుడు పేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై మరమ్మతులకు గురైన తన లారీకి మరమ్మతులు చేస్తుండగా మరో లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముతుజా ఖాన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే ఇదే ఘటనలో క్లీనర్ జగన్ కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ వ్యక్తిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.