31మందికి షోకాజ్ నోటీసులు జారీ

51చూసినవారు
31మందికి షోకాజ్ నోటీసులు జారీ
సాధారణ ఎన్నికల శిక్షణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు ఈనెల 2వ తేదీన 3వ దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణకు గైర్హాజరైన 31 మందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు సంజాయిశి ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్