ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గ్రానైట్ కు నిలయమైన చీమకుర్తి పట్టణంలో గంజాయి భూతం జడలు విప్పుతోంది. ఇటీవల బడ్డీ బంకుల్లో సైతం గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. తాజాగా 2. 6 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చీమకుర్తిలో ఎస్ఈబీ డీఎస్పీ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.