ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్దిపాడులో ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ను క్రమబద్దీకరించడమే కాకుండా, గొడవలు మొదలైనవి జరగకుండా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ప్రజలకు ఎన్నికల కౌంటింగ్ పైఅవగాహన కల్పించారు.