AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. మే నెల నుంచి విద్యార్థుల భోజనానికి నాణ్యమైన బియ్యం అందిస్తామని అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, హాస్టళ్లకు అత్యంత క్వాలిటీతో బియ్యం సరఫరా చేస్తామన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని మంత్రి గుర్తుచేశారు. బియ్యం ఏ విధంగా సరఫరా చేయాలనేది త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని వెల్లడించారు.