ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రానికి మరో అల్పపీడన ముప్పు ఉందని అధికారులు చెబుతున్నారు.