శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరోసారి శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా మరో 28 రైళు సర్వీసులను నడిపిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపుర్ నుంచి కొల్లంకు ఈ రైళ్లు నడపనున్నారు. ఇక, డిసెంబర్ 11 నుంచి జనవరి 29 వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి.