పంటల సాగులో నాణ్యమైన విత్తనాలు విత్తడంతో పాటు ఎరువుల వాడకం తప్పనిసరి. ఈ క్రమంలో రసాయనిక ఎరువుగా భాస్వరంను వినియోగించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. నూనె గింజల పంటలలో భాస్వరంను సింగిల్ సూపర్ పాస్పేట్ రూపంలో వేసుకోవడం వల్ల భాస్వరంతో పాటుగా కాల్షియం, గంధకం పోషకాలు కూడా లభ్యమై అధిక దిగుబడులు పొందవచ్చని పేర్కొంటున్నారు.