అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9 రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యమైన తేదీ అన్నారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు అధికారికంగా తెలంగాణ తల్లి ప్రతిరూపం ప్రకటించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. “తెలంగాణ తల్లి అంటే తల్లి ప్రేమ, బహుజన జాతి స్ఫూర్తి ప్రతిబింబం. ఇవాళ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించడం ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు గౌరవించబోతున్నాం” అని పేర్కొన్నారు.