మాజీ మంత్రి విడదల రజిని బెయిల్ పిటిషన్‌పై విచారణను అమరావతి హైకోర్టు వాయిదా వేసింది. వైసీపీ హయాంలో స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి రూ. కోట్లలో ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ విడుదల రజినిపై కేసు నమోదు చేసింది. దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం ఈ పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.