వైద్యరంగ చరిత్రలోనే చైనా వైద్యులు సరికొత్త అధ్యయం లిఖించారు. లివర్ మార్పిడి ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసి మనిషికి పంది లివర్‌ను అమర్చారు. ఆ లివర్ ఎంతో బాగా పనిచేస్తోంది. పంది లివర్‌ను మనిషికి పెట్టడం అనేది ప్రపంచంలోనే ఇదే తొలిసారి. చైనాలోని ఫోర్త్ మిలిటరీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన కై-షాన్ టావో, జావో-జు యాంగ్, జువాన్ జాంగ్, హాంగ్-టావో జాంగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ ఆపరేషన్ చేశారు.