ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిరీక్షించే అవసరం లేకుండా ముందుస్తుగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనుంది. మొన్నటి వరకు భూముల రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వెయిటింగ్ చేయకుండా రిజిస్ట్రేషన్ సమయానికి వెళ్తే సరిపోతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది.