TG: నిజామాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. రోగులను వదిలేసి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. ఓ రోగి భర్త అటెండర్స్ లేకపోవడంతో రోగిని భుజంపై ఏడో అంతస్తు వరకు మోసుకు వెళ్లాడు. ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ కూడా పాల్గొన్నారు. ఫిట్స్‌తో వచ్చిన లక్ష్మీ అనే మహిళకు వైద్యం చేయకుండా వదిలేసి వెళ్లారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.