అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా థియేటర్లలో విడుదలై దగ్గర దగ్గర మూడు నెలలైంది. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా అమెరికాలోని టెక్సాస్ వేదికగా జరిగిన ఓ బాస్కెట్ బాల్ మ్యాచ్‌లో ‘పుష్ప-2’ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్ ప్లే చేశారు. ఈ పాటకు అక్కడి చీర్ గర్ల్స్ అదిరిపోయే స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.