దక్షిణ భారత్‌పై కుట్ర జరుగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. 2027లో దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, డీలిమిటేషన్‌ను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఉత్తర భారత్‌లో ఎంపీ స్థానాలు పెంచి.. దక్షిణ భారత్‌లో తగ్గిస్తున్నారని ఆరోపించారు. దేశంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలు లేకుండా చేయాలని కేంద్రం చూస్తోందని పాల్ మండిపడ్డారు.