ఒడిశాలో రైలు ప్రమాదం.. ఒకరి మృతి (VIDEO)

72చూసినవారు
ఒడిశాలోని చౌద్వార్ సమీపంలో బెంగళూరు-కామాఖ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరికొంతమంది గాయపడ్డారు. మంగులి సమీపంలోని నిర్గుండి వద్ద రైలు పట్టాలు తప్పింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడపాల్సిన ఇతర రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్