నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా గురువారం నాటికి జలాశయంలో 51. 001 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం అధికారి దశరథ రామిరెడ్డి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 14, 658 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. పెన్నా డెల్టాకు 50 క్యూసెక్కులు, కండలేరు జలాశయానికి 10, 000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. 219 క్యుసెక్యుల నీరు ఆవిరి అవుతుంది.