అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో ఆదివారం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తూ విద్యార్థులు జాతీయ జెండాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి పటేల్ దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు.