మరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో ఆదివారం ఉపాధ్యాయుడు చల్లా చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు వెంగళరావు, వంశీ, మనోహర్, శీను, మహేష్, నిహారిక, సాయి భార్గవి తదితరులు పాల్గొన్నారు.