నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. భోజనంలోని నాణ్యతను పరిశీలించారు. ప్రతిరోజు మూడు పూటలా భోజనం సమయానికి అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆయన అక్కడ భోజనం చేశారు. కాగా అన్న క్యాంటీన్ ను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటలక్ష్మి ప్రారంభించిన విషయం తెలిసిందే.