నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ గురువారం ఆత్మకూరు, ఏఎస్పేట, సంఘం పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లలోని రికార్డులు పరిశీలించారు. పోలీసు సిబ్బందికి ప్రత్యేక సూచనలు, సలహాలు చేశారు. క్రైమ్ నియంత్రణ, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఏఎస్ పేట కానిస్టేబుల్ రమేష్ గురించి ఆరా తీశారు.