నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఐపీఎస్ సంఘం మండల పోలీస్ స్టేషన్ ను గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ల లోని రికార్డులు పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళలపై అఘాయిత్యాలు, సైబర్ మోసాలు, కిడ్నాపులు వీటిపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులతో మండల పరిస్థితిని తెలుసుకుంటాన్నానన్నారు.