పెద్దముడియం: వ్యవసాయ మోటర్ పడి రైతుకు గాయాలు
పెద్దముడియం మండలం మట్టివారిపల్లె వద్ద వ్యవసాయ బావికి విద్యుత్ మోటర్ అమర్చుతుండగా రైతుపై మోటర్ పడితీవ్రంగా గాయపడినట్లు శనివారం బాధితుడి కుటుంబీకులు తెలిపారు. పెద్దముడియం మండలం మట్టివారిపల్లికి చెందిన రైతు చెన్నారెడ్డి (47), తన వ్యవసాయ బావికి శుక్రవారం మోటర్ అమర్చుతుండగా ప్రమాదం జరిగింది. బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.