జమ్మలమడుగు: శివయ్య నామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు
జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు శివాలయాలు కార్తీక మాస రెండవ సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర నామ స్మరణతో ఆలయాలు మారు మ్రోగాయి. పురాతన ఆలయమైన భీమ లింగేశ్వరస్వామి ఆలయంలోని అర్చకులు నాగ ఫణీంద్ర శాస్త్రి ఆధ్వర్యంలో శివునికి పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకాలు పూజలు నిర్వహించారు.