కావలి ఒకటో పట్టణ ఎస్ఐగా టి. సుమన్ నియమితులయ్యారు. గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనను పలువురు స్థానిక ప్రముఖులు కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతల అదుపునకు ప్రత్యేకంగా కృషి చేస్తానని వివరించారు. గతంలో కావలి గ్రామీణ, దగదర్తి, బిట్రగుంట స్టేషన్లలో సైతం విధులను నిర్వహించడం తో పాటు ప్రజల మన్ననలు పొందారు.