కావలి పట్టణం 19వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది ఆలస్యంగా రావడం పై ఆరా తీశారు. 40 మంది పిల్లలకు నలుగురు మాత్రమే ఉండటం, సిబ్బంది లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, సమయానికి ఆహారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.