నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతో కలిసి బుధవారం మహాత్ముని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, దేశమే కాదు ప్రపంచం మొత్తం గాంధీజీని మహాత్మా అని సంబోధిస్తారన్నారు.