ఉదయగిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ కే. శ్రీనివాసులు ప్రయాణికుడు బస్సులో పోగొట్టుకున్న పర్సును తిరిగి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. బస్సులో ప్రయాణికుడు భాష ఈనెల 17వ తేదీన పర్సును పోగొట్టుకున్నాడు. అందులో 1700 నగదు, ఏటీఎం కార్డులు ఉండడంతో కండక్టర్ డిపో మేనేజర్ శ్రీనివాసులు కు అప్పగించారు. వివరాలు తెలుసుకొని ఆదివారం సంబంధిత వ్యక్తికి డిపో మేనేజర్ శ్రీనివాసులు, కండక్టర్ పర్సును అందజేశారు.