ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని దుత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆయుబ్ అప్సర్ తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య కార్యక్రమాలను వాటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.