కలిగిరి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థినిని కొట్టి టీసి ఇచ్చి పంపించేసిన విషయం విధితమే. ఈ విషయం సంచలనంగా కూడా మారింది. దీంతో కావలి ఆర్డీవో వంశీకృష్ణ ఈ ఘటనపై విచారణ చేశారు. ఒక విద్యార్థినిని కొట్టి టీసీ ఇవ్వడానికి కారణం ఏంటి అంటూ ప్రధానోపాధ్యాయుడు భీమేశ్వరరావును ప్రశ్నించారు. అనంతరం విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు శ్రీనివాసులను హెచ్చరించారు. అలాగే విద్యార్థినిని పరామర్శించారు.