ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కు బిఎంఎస్ ఉదయగిరి అంగన్వాడీల యూనియన్ నాయకురాలు షేక్ చాంద్ బేగం శాలువా పూలమాలతో సత్కరించారు. ఆదివారం ఉదయగిరి పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భరత్ కుమార్ యాదవ్, రమేష్ రెడ్డి ఉన్నారు.