ధర్మవరం పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. ఇటీవల సిఐ మాతృమూర్తి మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ధర్మవరం వెళ్లారు. పట్టణంలోని సీఐ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు.