ధర్మవరం మున్సిపాలిటీలోని 15వ వార్డులోని అంగన్వాడీ పాఠశాలలో గురువారం ఎల్సీడీ ప్యాడ్లు పంపిణీ చేస్తున్నామని వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు పళ్లెం కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో భాగంగా అంగన్వాడీ పాఠశాల విద్యార్థులకు ఎల్సీడీ ప్యాడ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు హాజరవ్వాలని కోరారు.