ధర్మవరం మండలంలో శనివారం జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గొట్లూరు పంచాయతీలో టిడిపి అభ్యర్థి నీరుగంటి చంటెప్ప అధ్యక్షుడిగా, బిజెపి అభ్యర్థి కూర్మ నారాయణ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మవరం సంఘం అధ్యక్షుడిగా రేనాటి శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎన్నికల కోసం డి. ఎస్. పి శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.