గుంతకల్లు: జంతువుల వ్యర్థాలను రోడ్డు మీద వేస్తే జరిమానా

70చూసినవారు
గుంతకల్లు: జంతువుల వ్యర్థాలను రోడ్డు మీద వేస్తే జరిమానా
గుంతకల్లు పట్టణంలోని మోదీనాబాద్ ఏరియాలో గల జంతు వధశాలను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు మహిళలు జంతు వధశాల నుంచి వ్యర్థాలు రోడ్డు మీదకు వస్తున్నాయని దీంతో కాలనీలో ఇబ్బందిగా ఉందని కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ జంతు వధశాల నిర్వహకులకు రోడ్డుమీద వ్యర్థాలను వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్